# Tags

సెహ్వాగ్‌ను సచిన్‌ డిన్నర్‌కు ఆహ్వానించిన వేళ

భారత క్రికెట్లో సచిన్‌ తెందుల్కర్‌ – వీరేంద్ర సెహ్వాగ్‌ ఓపెనింగ్‌ జోడీకి ఉన్న క్రేజే వేరు. ఈ ఇద్దరూ కలిసి భారత్‌కు ఎన్నో అపూర్వ విజయాలు అందించారు. డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతుంటే మరో పక్క సచిన్‌ అతడికి సలహాలు ఇస్తూ నెమ్మదిగా ఆడేవాడు. మ్యాచ్‌ మధ్యలో ఇద్దరూ కలిసి జోకులు వేసుకుని నవ్వుకుంటూ, పాటలు పాడుకుంటూ ఆడిన సంగతి తెలిసిందే.

సెహ్వాగ్‌ ఇప్పుడైతే చలాకీగా.. మాటల తూటాలు పేలుస్తున్నాడుగానీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొత్తలో చాలా సైలెంట్‌గా ఉండేవాడట. ఈ విషయాన్ని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ తెలిపాడు. ఓ వెబ్‌ షో ద్వారా సచిన్‌ ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘టీమిండియాలో చేరిన కొత్తలో సెహ్వాగ్‌ చాలా సైలెంట్‌గా ఉండేవాడు. నాతో మాట్లాడేవాడే కాదు. ఇద్దరం కలిసి ఆడాలి. బ్యాటింగ్‌ చేయాలి. ఇదంతా బాగుండాలంటే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండాలని భావించాను. సెహ్వాగ్‌ నాతో ఫ్రీగా ఉండేటట్లు చేసుకోవాలి అనుకుని ఒకరోజు డిన్నర్‌కు ఆహ్వానించా. వెంటనే వీరూ… నేను చికెన్‌ తినను. చికెన్‌ తింటే లావుగా కనిపిస్తా అని బదులిచ్చాడు. లావుగా కనిపించినప్పుడే చికెన్‌ తింటానని నేను అన్నాను’ అని సచిన్‌ తన అనుభవాలను పంచుకున్నాడు.

‘ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో పాడైన వస్తువులను రిపేర్‌ చేస్తూ ఉంటాను. ఇంట్లోనే కాదు టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూడా ఇలా చేసేవాడ్ని. ఏవైనా వస్తువులను రిపేర్‌ చేసే సమయంలో నేను చాలా ఎంజాయ్‌ చేస్తాను. ఫ్యాన్‌లు, పెయింటింగ్‌లు, కిటీకీలు ఇలా అన్ని. ఈ పనులన్ని మీకెందుకు అని అంజలి అంటుండేది. కానీ, నాకు ఇది చాలా ఇష్టమైన పని’ అని సచిన్‌ తెలిపాడు.

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *